లంకపై భారీ విజయం.. 2-0తో సిరీస్ కైవసం

Spread the love

ఇండోర్ వేదికగా శ్రీకంకతో జరిగిన రెండో టీ20లో భారత్ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. లంక జట్టుకు 261 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా.. 17.2 ఓవర్లలో 172 పరుగులకు లంక జట్టును ఆలౌట్ చేసింది. స్పిన్నర్లు యజువేంద్ర చాహల్ 4, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్య, ఉనాద్కత్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసంతో లంక జట్టును ఊచకోతకోసిన టీమిండియా సారథి రోహిత్‌ శర్మ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు.

అంతకుముందు.. రోహిత్‌ శర్మ టీ20 చరిత్రలో వేగవంతమైన సెంచరీ (118; 42 బంతుల్లో 12×4, 10×6) నమోదు చేయడంతో భారత్ 260 పరుగుల భారీ స్కోరు సాధించింది. రోహిత్‌తో పాటు మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (89; 49 బంతుల్లో 5×4, 8×6) కూడా రాణించడంతో భారత్.. టీ20 చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరు సాధించింది. మహేంద్ర సింగ్ ధోనీ కూడా కాసేపు బ్యాట్ ఝళిపించడంతో లంక జట్టుకు చుక్కలు కనిపించాయి.

Loading...

Leave a Reply

Your email address will not be published.