పాక్ డ్రెస్సింగ్ రూములోకి వెళ్లలేదు: ద్రవిడ్

Spread the love

అండర్-19 ప్రపంచకప్ సమయంలో పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూములోకి తాను వెళ్లానని రూమర్లు రావడంపై భారత అండర్-19 జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. న్యూజిలాండ్‌లో గత శనివారం ముగిసిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుని మట్టికరిపించిన భారత్ నాలుగోసారి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఫైనల్‌ కంటే ముందు జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుని 203 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం రాహుల్ ద్రవిడ్ పాకిస్థాన్ డ్రెస్సింగ్‌ రూముకి వెళ్లినట్లు రూమర్లు వచ్చాయి.

‘పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూము లోపలికి నేను వెళ్లలేదు. వారి జట్టులో చాలా నైపుణ్యమున్న ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అతను చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో.. డ్రెస్సింగ్ రూము వెలుపలికి వెళ్లి ఆ యువ బౌలర్‌ని అభినందించాను. ఒక కోచ్‌గా అతడ్ని ప్రోత్సహించాను తప్ప.. వేరే ఉద్దేశం లేదు’ అని ద్రవిడ్ వివరణ ఇచ్చాడు. టోర్నీలో ఓటమి ఎరుగకుండా టైటిల్ గెలిచేలా భారత యువ జట్టును తీర్చిదిద్దిన ద్రవిడ్‌‌కి బీసీసీఐ రూ.50 లక్షలు నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే.

Loading...

Leave a Reply

Your email address will not be published.