అజ్ఞాతవాసిలో అలీ ఎందుకు కనిపించలేదో తెలుసా..?

Spread the love

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయటి వ్యక్తుల్లో అత్యంత ఇష్టపడేది త్రివిక్రమ్ శ్రీనివాస్ ని. అతని తర్వాత అలీ ని ఎక్కువగా అభిమానిస్తారు పవన్.అందుకే తొలిప్రేమ సినిమా నుంచి దాదాపు ప్రతి సినిమాలోనూ ఆలీ చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రలే దక్కించుకున్నాడు. ఆలికి కూడా పవన్ అంటే వల్లమాలిన ప్రేమ. పవన్ మూవీస్ లో అలీ కోసం ఏదో ఒక పాత్రని సృష్టించేస్తారు దర్శకులు.

కాని అజ్ఞాతవాసి టీజర్ లో ఆలి జాడ ఎక్కడ కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రావు రమేష్, మురళి శర్మ తో కామెడీ చేయించినట్టు కనిపిస్తోంది. అయితే చిత్ర యూనిట్ మాత్రం దీని గురించి నోరు విప్పడం లేదు. సినిమాలో ఉన్న అన్ని పాత్రలను టీజర్ లో చూపలేదని ఆ మాట కొస్తే కీలకమైన పాత్రలు పోషించిన ఖుష్బూ, ఆది పినిశెట్టిలనే ఇంత వరకు రివీల్ చేయలేదని అలాంటప్పుడు ఆలి లేడే అని క్వశ్చన్ చేయటం ఏంటని చిత్ర యూనిట్ ప్రశ్నిస్తుంది. మరి వీళ్ళు చెప్పినట్టు ఆలి అందులో నిజంగా ఉన్నాడా లేక ఏదైనా తేడా కొట్టి ఆ సినిమా చేయలేకపోయాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ లో పడింది.

Loading...

Leave a Reply

Your email address will not be published.