శ్రీలంక ఆటగాళ్లకు ధోనీ క్లాస్.. ఎందుకు..?

Spread the love

భారత క్రికెట్ జట్టు సారథి బాధ్యతల నుంచి తప్పుకున్నా మహేంద్ర సింగ్ ధోనీ సలహాలు, సూచనలు మాత్రం జట్టుకు ఎప్పుడూ ఉంటాయి. కోహ్లి కెప్టెన్‌గా ఉన్నప్పటికీ మైదానంలో ఎప్పటికప్పుడు ధోనీ సలహాలు తీసుకుంటూనే ఉంటాడు. అలాగే జట్టులోకి యువ ఆటగాళ్లందరికీ ధోనీ మార్గదర్శకుడిగా నిలుస్తున్నాడు. కేవలం టీమ్ ఇండియా ప్లేయర్లకే కాక ఇతర జట్ల ఆటగాళ్లకు కూడా ధోనీ స్ఫూర్తినిస్తున్నాడు. వారికి సలహాలు ఇస్తూ తన గొప్పతనాన్ని చాటుకుంటున్నాడు.

ఇదేదో పనిగట్టుకుని చేయకపోయినా ఆ సలహాలు ఇతర జట్ల ఆటగాళ్లకు ఉపయోపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల శ్రీలంక జట్టు భారత పర్యటనను ముగించుకుంది. మూడు ఫార్మాట్లలోనూ సిరీస్‌లను కోల్పోయి రిక్తహస్తాలతో ఇంటికి బయలుదేరింది. అయితే టీ20 సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ అయిపోయిన తరవాత ధోనీ శ్రీలంక ఆటగాళ్లతో మాట్లాడాడు. తీవ్ర నిరాశతో ఉన్న వారికి ఎవో మెళకువలు చెపుతూ కనిపించాడు. ఈ దృశ్యం మైదానంలోనే కనిపించింది. మూడో టీ20 మ్యాచ్ పూర్తయిన తరవాత జరిగిన బహుమతుల ప్రదాన కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా సంజయ్ మంజ్రేకర్‌తో శ్రీలంక కెప్టెన్ పెరీరా మాట్లాడుతున్నాడు.

అప్పుడు ధోనీ శ్రీలంక ప్లేయర్ల దగ్గరకు వెళ్లాడు. వారితో కాసేపు మాట్లాడాడు. ధోనీ చెపుతున్న మాటలకు ఉపుల్ తరంగ, అకిల ధనంజయ, సదీర తలఊపుతూ బదులివ్వడం వీడియో స్పష్టంగా కనిపించింది. ఈ వీడియోను ఓ క్రికెట్ అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కల్మషంలేని ధోనీ మనస్తత్వంపై ఆయన అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘దటీజ్ ధోనీ’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.