రెండో ర్యాంక్‌కు టీమిండియా

Spread the love

అనుష్క శర్మతో వివాహం కారణం గా శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌కు దూరంగా ఉండడం.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ర్యాంకిం గ్‌పై ప్రభావం చూపింది. ఇప్పటి దాకా అగ్రస్థానం లో ఉన్న తను తాజాగా ఐసీసీ ప్రకటించిన ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపో యాడు. 824 పాయింట్లతో ఉన్న కోహ్లీ ఏకంగా 48 ర్యాంకింగ్‌ పాయింట్లు కోల్పోవాల్సివచ్చింది.

తొలి రెండు స్థానాల్లో ఆరోన్‌ ఫించ్‌ (784), ఎవిన్‌ లూయిస్‌ (780) ఉన్నారు. రాహుల్‌ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇక శ్రీలంకతో 3-0తో సిరీస్‌ గెలవడం టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత జట్టుకు లాభించింది. ఐదో స్థానం నుంచి ఏకంగా రెండో స్థానానికి చేరుకుంది. పాకిస్థాన్‌ టాప్‌లో ఉంది. బౌలింగ్‌ విభాగంలో బుమ్రా మూడో స్థానంలో ఉన్నాడు

Loading...

Leave a Reply

Your email address will not be published.