ఆసియా టీం ఛాంపియన్‌షిప్: భారత సారథులుగా సింధు, శ్రీకాంత్

ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు సారథులుగా సింధు, శ్రీకాంత్‌లు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని బాయ్(బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా)నే ప్రకటించింది. ఫిబ్రవరి 6 నుంచి 11 వరకు మలేసియాలో జరిగే ఈ టోర్నీలో అగ్రశ్రేణి క్రీడాకారులు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో భారత జట్టు బరిలో దిగనుంది. గతేడాది కొద్దిపాటిలో సెమీస్‌ బెర్తులు కోల్పోయిన భారత్‌ ఈసారి పతకాలు సాధించగలదనే నమ్మకాని బాయ్‌ వ్యక్తంజేసింది.

పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌, ప్రణయ్‌, సాయిప్రణీత్‌, సమీర్‌వర్మ ఆడబోతున్నారు. మహిళల సింగిల్స్‌లో సింధు, సైనా, శ్రీకృష్ణప్రియ, రుత్విక శివానిలు పాల్గొననున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజు -చిరాగ్‌ శెట్టి, మను అత్రి-సుమీత్‌రెడ్డి, శ్లోక్‌- అర్జున్‌ మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి, ప్రజక్త సావంత్‌-సంయోగిత, రితుపర్ణ దాస్‌-మిథిల భారత జట్టుకు ఎంపికయ్యారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.