షోయబ్ అక్తర్‌పై పంచ్ వేసిన యువరాజ్

Spread the love

సిక్సుల సింగ్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ ద్వారా పాక్ బాలర్ అయిన షోయబ్ అక్తర్‌కు పంచ్ వేశాడు. తనేదో ఇన్‌స్పిరేషనల్ మెసేజ్ ఇస్తున్నాడులే అని వదిలేయకుండా అక్తర్ చేసిన ట్వీట్‌కు కౌంటర్ వేశాడు. షోయబ్ అక్తర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ‘లక్షాలను చూసి భయపడకండి. కష్టపడి పని చేస్తే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. మీ కలల్ని కూడా’ అనే పోస్ట్‌ను ఉంచాడు.

దీనికి స్పందించిన యువరాజ్ సింగ్ ‘అంతా బాగానే ఉంది కానీ, ఇప్పుడు ఎవరికి వెల్డింగ్ చేయడానికి వెళ్తున్నావ్.’ అంటూ చమత్కరించాడు. ఆ ఫొటోలో అక్తర్ వెల్డింగ్ డ్రస్‌తో హెల్మెట్ పట్టుకుని ఉండటంతో అలా స్పందించి ఉండాలి. 2007 టీ 20 ప్రపంచ కప్‌లో యువరాజ్ సింగ్ సిక్సులు ఇప్పటికీ ఎవరూ మరిచిపోరు. ఎలాంటి స్పిన్ బౌలర్లకైనా యువరాజ్ సింగ్ బ్యాటింగ్ అంటే అదుర్స్.

కొంతకాలంగా భారత జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న యువరాజ్ సింగ్ ఐసీసీ కమిటీ సెలక్షన్ మేరకు దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరాడు. ఈ మధ్యనే ఫిట్‌నెస్ పరీక్షల్లో పాసైన యువరాజ్ మళ్లీ అదే స్థాయిలో రాణించాలని ఆశిద్దాం.

Loading...

Leave a Reply

Your email address will not be published.