రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు

Spread the love

టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. శ్రీలంక సిరీస్‌లో రెచ్చిపోయి ఆడుతున్న రోహిత్ తన రికార్డుల వేటను కొనసాగిస్తున్నాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో డబుల్ సెంచరీ, టీ20లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ ఖాతాలోకి మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 65 సిక్సర్లు బాదిన రోహిత్.. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డుల కెక్కాడు.

మొత్తం ఈ సంవత్సరంలో టెస్ట్ మ్యాచులు, ఓడీఐలు, టీ20లు కలిపి మొత్తం 65 సిక్సులను కొట్టాడు. ఇది వరకు 2015లో సౌత్ ఆఫ్రికా ఆటగాడు ఏబీ డివీలియర్స్ 63 సిక్సులు, 2012లో వెస్టిండిస్ ఆటగాడు క్రిస్ గేల్ 59 సిక్సులు, 2011లో ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ 57 సిక్సులు, 2005లో పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది 56 సిక్సులు కొట్టి రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పుడు వీళ్ల రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. కోహ్లీ గైర్హాజరీతో శ్రీలంకతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌కు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రోహిత్.. రెండు సిరీస్‌లలోనూ భారత్‌కు అపూర్వ విజయాలు అందించాడు. ఈ క్రమంలో పలు రికార్డులు నమోదు చేశాడు.

మొహాలీలో జరిగిన రెండో వన్డేలో అజేయంగా 208 పరుగులు చేసిన రోహిత్ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇండోర్‌లో జరిగిన రెండో టీ20లో 35 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న రోహిత్ టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. 35 బంతుల్లోనే సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్‌ రికార్డును సమం చేశాడు. ఇక కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తొలి సిరీస్‌నే భారత్‌కు అందించిన ఆటగాడిగా రోహిత్ మరో రికార్డు నెలకొల్పాడు.

Loading...

Leave a Reply

Your email address will not be published.