రోహిత్ శర్మకు డిఫెన్స్ రాదు: డీన్ జోన్స్

Spread the love

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ సైతం రోహిత్ శర్మను విశ్లేషించడం మొదలుపెట్టాడు. డిఫెన్స్‌ నైపుణ్యం లోపించడమే రోహిత్‌ శర్మను దెబ్బతీస్తోందంటూ వ్యాఖ్యానించాడు. ‘నేను అతని ఆటతీరును గమనించాను. తను వన్డే మ్యాచ్‌ల్లో బాగా ఆడగలడు. కానీ, అదే తీరును టెస్ట్ మ్యాచ్‌ల్లో ప్రదర్శిస్తే కష్టం. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్‌ల్లో డిఫెన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ, అది రోహిత్ చేయలేకపోతున్నాడు.’ అని ఆయన అభిప్రాయపడ్డాడు.

‘టెస్టు క్రికెట్లో 70 శాతం బ్యాటింగ్‌ డిఫెన్సే. వన్డేల్లో అది 40 శాతమే. డిఫెన్స్‌ విషయంలో గవాస్కర్, రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌, కోహ్లిల నుంచి రోహిత్‌ ప్రేరణ పొందాలి” అని జోన్స్‌ చెప్పాడు. కానీ, దక్షిణాఫ్రికా టెస్టులో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మినహాయించి భారత జట్టులో ఏ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయలేకపోయారు. మిగిలిన ఆటగాళ్లు కూడా అదే స్థాయిలో రాణించకపోతే తర్వాత జరగనున్న ఇంగ్లాండ్ పర్యటనలో కష్టాలపాలవ్వాల్సిందే. అంటూ వ్యాఖ్యానించాడు.

Loading...

Leave a Reply

Your email address will not be published.