టీ20 లాంటి ధనాధన్‌ క్రికెట్‌… బౌలర్‌ కూడా హెల్మెట్‌తో!

Spread the love

క్రికెట్‌లో బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ హెల్మెట్లు పెట్టుకోవడం ఎప్పుడో మొదలైంది. టీ20 లాంటి ధనాధన్‌ క్రికెట్‌ వచ్చిన తర్వాత పవర్‌ హిట్టింగ్‌ మరింతగా పెరగడంతో అంపైర్లు కూడా హెల్మె ట్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఓ బౌలర్‌ హెల్మెట్‌తో బౌలింగ్‌ చేసి సరికొత్త ట్రెండ్‌ సృష్టిం చాడు. సూపర్‌ స్మాష్‌ టీ20లో నార్తర్న్‌ నైట్స్‌తో మ్యాచ్‌లో ఒటాగో పేసర్‌ వారెన్‌ బార్నెస్‌ హెల్మెట్‌ ధరించి బౌలింగ్‌ చేయడం విశేషంగా ఆకర్షించింది.

బౌలింగ్‌ చేసే సమయంలో బంతిని విడిచేటప్పుడు బార్నెస్‌ తలకిందకు వంచుతాడు. ఒకవేళ బ్యాట్స్‌మెన్‌ స్ట్రయిట్‌ డ్రైవ్‌ కొడితే బంతి అతడి తలకు బలంగా తాకే ప్రమాదం ఉంది. దీంతో కోచ్‌ అతడి కోసం బేస్‌బాల్‌లో అంపైర్లు ఉపయోగించే హెల్మెట్‌ తరహాలో సరికొత్త హెల్మెట్‌ను తయారు చేయించాడు.

Loading...

Leave a Reply

Your email address will not be published.