ధోనీ కెప్టెన్సీలో ఆటను ఎంజాయ్ చేశా : ద్రవిడ్

Spread the love

భారత్‌కు రెండు వరల్డ్ కప్‌లతోపాటు ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన మహేంద్ర సింగ్ ధోనీపై మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు. భారత్‌కు తిరుగులేని విజయాలు అందించిన ధోనీ కెప్టెన్సీలో ఆడటాన్ని ఎంతో ఎంజాయ్ చేశానని మిస్టర్ డిపెండబుల్ చెప్పాడు. తను చేయలేకపోయింది మీరు చేయండని ధోనీ ఇతరులకు ఎప్పుడూ చెప్పడని.. అతడిలో ఇదే నాకు బాగా నచ్చుతుందని ద్రవిడ్ చెప్పాడు.

ధోనీని నిజమైన నాయకుడిగా అభివర్ణించిన ద్రావిడ్.. మిస్టర్ కూల్‌ను లెజెండ్‌గా అభివర్ణించాడు. తన జీవితం ఆధారంగా బయోపిక్ తీసే విషయమై ద్రవిడ్ స్పందించాడు. నా బయోపిక్ చాలా బోరింగ్ ఉంటుందని చెప్పిన రాహుల్.. తొలి అర్ధభాగంలో నేను సున్నా అని చెప్పాడు. రెండో అర్ధ భాగంలోనే నేను ఓ స్థాయికి చేరుకున్నా అని ట్వీట్ చేశాడు.

కాగా, ఈ తరానికి మీ బయోపిక్ ఎంతో అవసరమని.. మీరెంతో ఓపికగా, పట్టుదలతో ఆడారో నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయడ్డారు. మీరెంతో స్ఫూర్తినిచ్చారని మిస్టర్ డిపెండబుల్‌పై ప్రశంసలు గుప్పించారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.