ఇంగ్లాండ్ పై భరత్ అద్భుత విజయం..!!

Spread the love

ఇంగ్లాండ్ తో జరిగిన ఫస్ట్ టీ-20లో భారత్ భారీ విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అదరగొడుతూ.. ఇంగ్లాండ్ జట్టును మట్టికరిపించింది. దీంతో మరో టీ-20 విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ‘చైనామన్‌’ కుల్దీప్‌ యాదవ్‌ (5/17) మ్యాజిక్‌ బౌలింగ్‌కు తోడు కేఎల్‌ రాహుల్‌ (54 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 నాటౌట్‌) క్లాస్‌ శతకం తోడవ్వడంతో భారత్‌ 8 వికెట్ల తేడాతో నెగ్గింది.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జేసన్‌ రాయ్‌, బట్లర్‌ అదిరే ఆరంభాన్ని అందించారు. కానీ ఆ తర్వాత కుల్దీప్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో మిడిలార్డర్‌ దారుణంగా విఫలమైంది. ఓపెనింగ్‌ జోడీ ఆటతీరుతో ఓ దశలో 200 పరుగులు దాటుతుందనిపించినా కుల్దీప్‌ అడ్డుకున్నాడు. 11వ ఓవర్‌లో బట్లర్‌ చెలరేగి 4,6,4 బాదగా 18 పరుగులు రావడంతో పాటు 29 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కానీ లెగ్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తన వరస ఓవర్లలో హేల్స్‌ (8), మోర్గాన్‌ (7), బెయిర్‌స్టో, రూట్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత జట్టు కోలుకోలేకపోయింది.ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 18.2 ఓవర్లకే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యం ఛేదించింది.

 

Loading...

Leave a Reply

Your email address will not be published.