ఇండోర్ టీ20: తృటిలో వరల్డ్‌ రికార్డు మిస్!

Spread the love

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా తృటిలో వరల్డ్‌ రికార్డును మిస్సయ్యింది. ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 260 పరుగులు సాధించిన భారత్‌.. ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు నమోదు చేసిన రెండో జట్టుగా రికార్డుకెక్కింది. అయితే మరో 4 పరుగులు చేస్తే ఆస్ట్రేటియా రికార్డును తిరగరాసి మొదటి స్థానంలో నిలిచి ఉండేది. టీ20ల్లో అత్యధిక స్కోరు ఆసీస్‌ పేరుపై ఉంది. గతేడాది ఆ జట్టు శ్రీలంకపైనే 263 పరుగులు చేసి అత్యధిక టీ 20 స్కోరును నమోదు చేసింది.

ఇప్పుడు అదే జట్టుపై భారత్‌‌కు అత్యధిక స్కోరు సాధించే అవకాశం వచ్చినా.. తృటిలో ఆ అవకాశం చేజారింది. అంతకుముందు టీమిండియా అత్యదిక టీ20 స్కోరు 244/4. తాజా మ్యాచ్‌లో ఈ రికార్డును తిరగరాశారు. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోర్లను నమోదు చేసిన జట్ల పరంగా.. శ్రీలంకతో కలిసి భారత్‌ సంయుక్తంగా రెండో స్థానంలో నిలవడం గమనార్హం. 2007లో కెన్యాపై లంక జట్టు 6 వికెట్లు కోల్పోయి 260 పరుగులు సాధించింది. భారత సారథి రోహిత్ శర్మ.. అంతర్జాతీయ టీ20ల్లో వేగవంతంగా సెంచరీ సాధించిన రికార్డును సమం చేయడం మరో విశేషం.

35 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేసిన రోహిత్ ఓ దశలో డబుల్ సెంచరీ చేసేలా కనిపించాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్‌ మిల్లర్‌ కూడా 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేయడం గమనార్హం. భారత్ తరఫున టీ20ల్లో రెండుసార్లు సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Loading...

Leave a Reply

Your email address will not be published.