ఐర్లాండ్‌పై భారత్ ఘన విజయం..!!

Spread the love
ఐర్లాండ్‌తో బుధవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత ఓపెనర్లు రోహిత్ శర్మ (97: 61 బంతుల్లో 8×4, 5×6), శిఖర్ ధావన్ (74: 45 బంతుల్లో 5×4, 5×6) దూకుడుగా ఆడటంతో 5 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసింది భారత్ . ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌ను 132/9కే పరిమితం చేసింది.
స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4/21), చాహల్ (3/38) ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకున్న ఆ జట్టు ఏ దశలోనూ భారత్‌కి పోటీనివ్వలేకపోయింది. ఓపెనర్ జేమ్స్ (60: 35 బంతుల్లో 5×4, 4×6) కాసేపు క్రీజులో నిలిచి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా.. కుల్దీప్ అతడ్ని బోల్తా కొట్టించడంతో ఐర్లాండ్‌ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. రెండో టీ20 మ్యాచ్ శుక్రవారం రాత్రి 8.30 గంటలకి జరగనుంది.
Loading...

Leave a Reply

Your email address will not be published.