లంకపై భారత్ భారీ విజయం..

Spread the love

శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయం సాధించింది. టీమిండియా స్పిన్నర్‌ యజువేంద్ర చహల్ ‌(4-23) మాయాజాలానికి శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో లంకపై భారత్‌ 93 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ (61;) శుభారంభం అందించాడు.

మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (17) జట్టు స్కోరు 38 వద్ద ఔటైనా యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ (2)తో కలిసి దూకుడుగా ఆడాడు. ఇక చివర్లో ఎంఎస్‌ ధోనీ (39), మనీశ్‌ పాండే (32) మెరుపులు మెరిపించారు. దింతో 181 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది భారత్. ఈ గెలుపుతో 3 టీ20ల సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యం సాధించింది.

Loading...

Leave a Reply

Your email address will not be published.