విరాట్ కోహ్లి అండగా నిలిచిన గౌతమ్ గంభీర్

Spread the love

ఇటలీలోని ఖరీదైన విల్లాలో ఇటీవల వివాహం చేసుకున్న భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి దేశభక్తిని భాజపా ఎమ్మెల్యే ప్రశ్నించడంపై వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. వివాహమనేది వారి వ్యక్తిగత విషయమని.. రాజకీయ నేతలు విమర్శించే ముందు జాగ్రత్త వహించాలని సూచించాడు. మధ్యప్రదేశ్‌లోని గుణ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోన్న పన్నాలాల్ సక్య మాట్లాడుతూ ‘ఈ దేశంలో రాముడు, కృష్ణుడు, విక్రమాదిత్య, యుదిష్ఠరుడు లాంటి వారు పెళ్లి చేసుకున్నారు.

మనలో ఎంతో మంది భారత్‌లోనే పెళ్లి చేసుకొని ఉంటారు, లేదంటే చేసుకుంటారు. కానీ అతడిలా ఎవరూ విదేశాలకు వెళ్లరు. భారత్ కారణంగా పేరు ప్రఖ్యాతలు, డబ్బు సంపాదించిన కోహ్లి.. ఆ సొమ్ముతో విదేశాల్లో పెళ్లి చేసుకున్నాడు’అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై గౌతమ్ గంభీర్ గురువారం స్పందించాడు.

‘వివాహం ఎక్కడ చేసుకోవాలనేది విరాట్ కోహ్లి, అనుష్క శర్మల వ్యక్తిగత విషయం. దీనిపై ఎవరికీ విమర్శంచే హక్కు లేదు. రాజకీయ నేతల ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి’ అని గంభీర్ హెచ్చరించాడు. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్‌ మధ్య గతంలో గొడవ జరిగిన విషయం తెలిసిందే.

Loading...

Leave a Reply

Your email address will not be published.