బ్రావో 400 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు

Spread the love

వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ-20 క్రికెట్‌లో 400 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర కెక్కాడు. ప్రస్తుతం బిగ్‌ బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌)లో మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌కు ఆడుతున్న బ్రావో.. హరికేన్స్‌ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాడు.

దాంతో, అతను 400 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. 365 టీ-20ల్లో (అంతర్జాతీయ మ్యాచ్‌లు సహా) అతను ఈ ఘనతను సాధించాడు. శ్రీలంక వెటరన్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ 248 మ్యాచ్‌ల్లో 331 వికెట్లతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

Loading...

Leave a Reply

Your email address will not be published.