టెస్ట్ క్రికెట్ లో అత్యంత చెత్త రికార్డును నమోదు చేసిన బంగ్లా..!!

Spread the love
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ జట్టు తన కెరీర్‌లోనే అత్యంత చెత్త రికార్డ్‌ను నమోదు చేసింది. 43 పరుగులకే ఆలౌట్ అయ్యి ఈ రికార్డు ను మూటకట్టుకున్నారు.. బ్యాట్స్ మెన్ వచ్చిన వాళ్లు వచ్చినట్టు పెవిలియన్ దారి మళ్లారు. ఒక్కరు కూడా రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు. విండీస్ పేస్ బౌలర్ కీమర్ రోచ్ చెలరేగి 5 ఓవర్లలో 8 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.
అతనికి మిగ్వెల్ 3 వికెట్లు తీసి, జేసన్ హోల్డర్ 2 వికెట్లు తీసి సహకరించారు. 4, 1, 0, 0, 0, 4, 1, 0, 6, 2… ఇవీ బంగ్లాదేశ్ ఆటగాళ్లు చేసిన స్కోర్. 141 ఏళ్ల టెస్టు చరిత్రలో ఇది రెండో అతి తక్కువ ఇన్నింగ్స్ 1955లో ఇంగ్లండ్ పై ఆడిన న్యూజిలాండ్ జట్టు 26 పరుగులకు ఆలౌట్ కాగా, ఆ తరువాతి చెత్త రికార్డు బంగ్లాదేశ్ దే. 2007లో శ్రీలంకపై 62 పరుగులకు కుప్పకూలిన బంగ్లాదేశ్, తన రికార్డును తాను మరోసారి దిగజార్చుకుంది.
Loading...

Leave a Reply

Your email address will not be published.