నేను కూడా డ్యాన్స్ చేస్తా: రోహిత్ శర్మ

Spread the love

కోహ్లీ, ధావన్, గేల్‌తో పాటు భారత క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా చేరిపోయాడు. ఇటీవలే ప్రత్యేకమైన డ్యాన్స్ చేసి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రోహిత్‌ అచ్చు ఏలియన్‌లా డ్యాన్స్‌ చేశాడు. రోహిత్‌ శర్మ తన ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా ఓ వీడియోను పంచుకున్నాడు. అందులో ఒక వైపు ఏలియన్‌ ఎలా డ్యాన్స్‌ చేస్తుందో అచ్చు అలాగే రోహిత్‌ కూడా చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ‘రోహిత్‌ చాలా బాగా డ్యాన్స్‌ చేశాడు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరో 5 రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌కు రోహిత్‌ సిద్ధమవుతున్నాడు.

ఇప్పటికే ముంబైలోని వాంఖడే మైదానంలో ప్రాక్టీస్‌ సెషన్లలో రోహిత్‌ పాల్గొంటున్నాడు. ఈ ఏడాది కూడా విజేతగా నిలవాలన్న పట్టుదలతో ముంబై ఇండియన్స్‌ అడుగులేస్తోంది. ఏప్రిల్‌ 7న ఐపీఎల్‌ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో గత ఏడాది విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడనుంది. ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలకు రోహిత్‌ శర్మ, మహేంద్ర సింగ్‌ ధోనీ మాత్రమే హజరవుతున్నారు. పలు కారణాల వల్ల ఇతర జట్ల కెప్టెన్లు హాజరుకాలేరని ఐపీఎల్‌ నిర్వాహకులు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

Loading...

Leave a Reply

Your email address will not be published.