వరుసగా ఆరు సార్లు ఓడిపోయిన వెస్టిండీస్

Spread the love

న్యూజిలాండ్ జట్టుకు వెస్టిండీస్ జట్లకు మధ్య టీ 20ల్లో భాగంగా మొదటి మ్యాచ్ గురువారం జరిగింది. ఈ మ్యాచ్ లోనైనా గెలవాలనే కసితో పోరాడినా వెస్టిండీస్ ఏ మాత్రం ఫలితం దక్కలేదు. మూడు టీ 20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్‌ నిర్దేశించిన 188 పరుగుల లక్ష‍్యాన్ని ఛేదించే క్రమంలో 140 పరుగులకే పరిమితమైన విండీస్‌ ఓటమి పాలైంది.

చతికిల పడ్డ విండీస్ బ్యాట్స్‌మెన్:
విండీస్‌ ఆటగాళ్లో ఆండ్రే ఫ్లెచర్‌(27), కార్లోస్‌ బ్రాత్‌వైట్‌(21), ఆష్లే నర్స్‌(20), జెరోమ్‌ టేలర్‌(20)లు తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. దీంతో వెస్టిండీస్ జట్టుకు పరాజయం తప్పలేదు.
విరుచుకుపడ్డ బౌలర్లు:
కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌతీ, సెత్‌ రాన్స్‌లు ఒకొక్కరు మూడు వికెట్లు చొప్పున తొమ్మిది వికెట్లను ఔట్ చేశారు. బ్రాస్‌ వెల్‌కు రెండు వికెట్లు దక్కాయి.సాంత్నార్‌, ఇష్‌ సోథీలు చెరో వికెట్‌ తీశారు.
వెస్టిండీస్‌కు వరుసగా ఆరో ఓటమి.

దీంతో ఇప్పటివరకు వరుసగా విండీస్‌పై టెస్టు, వన్డే సిరీస్‌లు గెలుస్తూ వస్తున్న కివీస్‌, టీ 20లో సైతం శుభారంభం చేసి 1-0 ఆధిక్యాన్ని సాధించింది. మరొకవైపు న్యూజిలాండ్‌ పర్యటనలో వెస్టిండీస్‌ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు. ఇది వెస్టిండీస్‌కు వరుసగా ఆరో ఓటమి.
తొలుత జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో కోల్పోయిన విండీస్‌.. మూడు వన్డేల సిరీస్‌లో వైట్‌ వాష్‌ అయ్యింది. తొలి టీ 20లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. కొలిన్‌ మున్రో(53), గ్లెన్‌ ఫిలిప్స్‌(55)లు హాఫ్‌ సెంచరీలతో రాణించి కివీస్‌ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.