రెండో టెస్టుకు అతను ఆడకపోతేనే మంచిది: గంగూలీ

Spread the love

దక్షిణాఫ్రికా పర్యటన లో భాగంగా కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ వేదికగా తొలిటెస్టు జరిగింది. ఈ టెస్ట్‌లో 72 పరుగులతో భారత్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాగా మ్యాచ్ జరిగిన తర్వాతి రోజునుంచి జట్టుపై విశ్లేషణ మొదలైంది. మాజీ క్రికెటర్లు, ప్రముఖ నిపుణుల దగ్గర్నుంచి చివరకు సామాన్య క్రికెట్ అభిమానులు సైతం జట్టులో మార్పుల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు మాజీ సారథి సౌరవ్ గంగూలీ జాతీయ జట్టులో మార్పులు సూచిస్తున్నాడు. జట్టులో శిఖర్ ధావన్‌కు బదులుగా కేఎల్ రాహుల్‌ను తీసుకుంటే బాగుంటుందంటూ సూచిస్తున్నాడు.

దాంతో పాటుగా రెండు ఇన్నింగ్స్‌లోనూ పెద్దగా రాణించలేక పోయిన రోహిత్ శర్మ‌ను కూడా మార్చితే బాగానే ఉంటుందని పేర్కొన్నాడు. నాకు తెలిసీ ఐదు బౌలర్లతో పాటు శిఖర్ ధావన్‌కు బదులుగా కేఎల్ రాహుల్‌ను ఆడనిస్తే బాగుండేది. అతను విదేశాల్లో ఆడిన అనుభవం ఉన్నవాడు. అంతేగాక విదేశీ పిచ్‌లపై బాగా రాణిస్తాడు కూడా. రోహిత్ శర్మ జట్టులో ఉండటం మరొక అవకాశం.కానీ, బ్యాట్స్‌మెన్‌లు అందరూ మంచి స్కోరు చేయలేకపోయారు. అని గంగూలీ అభిప్రాయపడ్డారు. ఇంకా మాట్లాడుతూ, రెండు ఇన్నింగ్స్ కలిపి పాండ్యాను మినహాయించి ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారని పెదవి విరిచాడు.

రెండో టెస్ట్‌కు మాత్రం ఇంకా మంచి ప్రాక్టీస్ చేయకపోతే విమర్శకులను ఎదుర్కోవడం చాలా కష్టమని వ్యాఖ్యానించాడు. కేవలం విరాట్ కోహ్లీ, రవి శాస్త్రి మాత్రమే టీమిండియా స్థితిగతులను మార్చేయలేరు. జట్టులోకి మళ్లీ అజింకా రహానే, కేఎల్ రాహుల్‌లలో ఒకరిని తీసుకుంటేనే పరిస్థితి మారగలదు. వివరించాడు. రెండో టెస్టు సెంచియో వేదికగా జరగనున్న నేపథ్యంలో ఆ మైదానం కేప్‌టౌన్ కంటే బౌన్సింగ్ పిచ్ అని తెలిపాడు. కేప్‌టౌన్‌లో ఆడిన దానికంటే జాగ్రత్తగా మరింత నేర్పుతో ఆడాల్సి ఉందంటూ విశ్లేషించాడు.

Loading...

Leave a Reply

Your email address will not be published.