చంద్రబాబు ఒక పిట్టలదొర.. జగన్ ఫైర్

Spread the love

వైసిపి అధినేత జగన్ మరోమారు చంద్రబాబుని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు నమ్మించే పిట్టల దొర చంద్రబాబు అని జగన్ పాదయాత్రలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. చంద్రబాబు పాలనలో రైతులు చాలామంది రోడ్డున పడ్డారని అన్నారు.

మరోమారు చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు జగన్ సూచించారు. జగన్ పాదయాత్రలో 40 వ రోజు అనంతలోని నల్లమాడ మండలంలో పర్యటించారు. రైతులని కష్టాల పాలు చేస్తున్న చంద్రబాబు లాంటి వారిని బంగాళా ఖాతంలో కలిపేయాలని జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం తనవల్ల మాత్రమే సాధ్యం కాదని మీరంతా కలసి రావాలని జగన్ ప్రజల్ని కోరారు. జగన్ వ్యాఖ్యలని టీడీపీ నాయకులూ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని పిట్టలదొర అని సంబోధించడం ఎంతవరకు సమంజసం అని టీడీపీ ప్రశ్నిస్తోంది. ప్రతిపక్షం అంటే ప్రజల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేవారని, ఇలా ఎప్పుడూ అర్థం లేని విమర్శలు చేసే వారు కాదని టీడీపీ కౌంటర్ ఇస్తోంది. పిట్టల దొర అని అనడం ఇదెక్కడి విమర్శ అని మండి పడుతున్నారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.