నాని టార్గెట్.. సక్సెస్ అవుతుందా..?

Spread the love

కొడాలి నాని…స్వర్గీయ ఎన్టీఆర్ కి వీరాభిమానిని అని చెప్పుకునే నాని…గత ఎన్నికల్లో వైకాపా గెలుస్తుంది అన్న ఆలోచనతో టీడీపీని వదలి వైకాపాలోకి కుంప్ అయిపోయాడు…అయితే అదే క్రమంలో నాని కామ్ గా పార్టీలో నుంచి వెళ్ళిపోయి ఉంటే అస్సలు ఎవ్వరూ పెద్దగా పట్టించుకునే అవకాశం ఉండేది కాదు..కానీ వెళ్లే సమయంలో నాని చేసిన కొన్ని విమర్శలు, ఆ తరువాత నాని ప్రభుత్వం టార్గెట్ గా చేస్తున్న అనేక విమర్శల వల్ల నాని టీడీపీకి టార్గెట్ గా మారాడు… అధికారం టీడీపీడి అయినప్పటికీ గుడివాడలో అంతా నాని రాజకీయమె నడుస్తూ ఉండడంతో గుడివాడపై ఫోకస్ పెట్టారు టీడీపీ మంత్రులు…

ఎలా అయినా నానిని దెబ్బ కొట్టాలీ అన్న ఆలోచనలో భాగంగా 36 మంది కౌన్సిలర్లున్న గుడివాడ మున్సిపాల్టీ లో గత ఎన్నికల్లో 21 మంది వైసీపీ సభ్యులు గెలుపొందగా…దీంతో గుడివాడ మున్సిపాలీటీని వైసీపీ గెలుచుకోగా..మెల్లగా అక్కడ నుంచే ప్లాన్ మొదలు పెట్టింది టీడీపీ…అందులో భాగంగానే మున్సిపల్ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాస్ కి ముగ్గురు పిల్లలు ఉన్నారంటూ నిబంధనలు తెరపైకి తెచ్చిన టీడీపీ ఆయన ఛైర్మన్ పదవికి అనర్హడుని తెలుగుదేశం నేత లింగప్రసాద్ తో ఫిర్యాదు చేయించింది… దీంతో పదవిని వదులుకోలేక యలవర్తి ఏకంగా 9 మంది వైసీపీకౌన్సిలర్లతో కలిసి టీడీపీలో చేరిపోయారు. ఆ తర్వాత మరో ముగ్గురినివైసీపీ నుంచి టీడీపీలోకి చేర్చుకున్నారు.

ఆ సంఘటనతో అప్పట్లో పెద్ద యుద్దమే జరిగింది. ఛైర్మన్ యలవర్తిని వైసీపీ కౌన్సిలర్ రవి చెప్పుతో కొట్టేంతవరకూ వెళ్లింది. అయితే అదంతా ఒక ఎత్తు అయితే…ఇప్పుడు అదే రవికాంత్ వైసీపీని వదిలి మంత్రుల సమక్షంలో టిడిపిలో చేరి..నానిపై విమర్శలు చెయ్యడం మరో ఎత్తుగా చెప్పవచ్చు..ఇదిలా ఉండగా…టీడీపీ అసలు టార్గెట్ 2019లో నానిని ఇంటికి పంపడమే అన్నది టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న వార్త…మరి ఇంత చేసిన వాళ్ళు…అది కూడా చేసినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. మొత్తంగా అదన్న మాట గుడివాడ కధ.

Loading...

One thought on “నాని టార్గెట్.. సక్సెస్ అవుతుందా..?

  • December 22, 2017 at 12:29 am
    Permalink

    గుడివాడ కధ

    Reply

Leave a Reply

Your email address will not be published.