బాలకృష్ణ కి అంత లేదు.. నేనే కాబోయే ఎమ్మెలే..

Spread the love

2019 ఎన్నికల్లో బాలకృష్ణని ఇంటికి సాగనంపకుంటే అరగుండుతో ఊరేగుతా అని వైసిపి హిందూపురం ఇంచార్జ్ నవీన్ నిశ్చల్ శపథం చేశారు. ఓ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో నవీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామీలని తుంగలో తొక్కిన బాలకృష్ణ ఇక గెలిచే పరిస్థితి లేదని అన్నారు. బాలయ్యని హిందూపురం ప్రజలు నమ్మరని అన్నారు.

2019 లో వైసీపీ తరుపున టికెట్టు దక్కితే బాలకృష్ణని ఇంటికి పంపుతా అని అన్నారు. అలా జరగని పక్షంలో అరగుండు గీయించుకుని హిందూపురంలో ఊరేగుతాని అని అన్నారు. 2009 లోనే తాను ఎమ్మెల్యే అయి ఉండే వాడినని, కానీ తనకు టికెట్ దక్కకుండా వై ఎస్ కు తనకు మధ్య రఘువీరా రెడ్డి అడ్డుగా నిలిచారని అన్నారు. తనకు ధనబలం లేకున్నా ప్రజాబలం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.