కేసీఆర్‍కు, బాబుకు తేడా ఇదే అంటున్న నిరుద్యోగులు

Spread the love

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూశారు. ప్రత్యేకించి భారీ స్థాయిలో రిక్రూట్ మెంట్ జరిగే ఉపాధ్యాయ, పోలీస్ నియామకాల కోసం కళ్లు కాయాలు కాసేలా ఎదురు చూశారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రాగానే వెంటనే డీఎస్సీ ప్రకటన ఇచ్చేశారు. వాటి నియామక ప్రక్రియ కూడా యుద్ద ప్రాతిపదికన జరిగిపోయింది. కానీ తెలంగాణలో మాత్రం ఉపాధ్యాయ ఉద్యోగ ప్రకటన నిరుత్సాహపరిచింది.

తెలంగాణలోనూ ఉపాధ్యాయ ప్రకటన వచ్చినా కేవలం కోర్టు కేసుల కారణంగానే ప్రక్రియ ఏడాదికిపైగా ఆలస్యమైంది. ఇంకా నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. ఇంకెప్పుడవుతుంది భగవంతుడా అని నిరుద్యోగులు ఎదుచూస్తున్నారు. కానీ ఇంతలోనే అటు ఏపీలో రెండో డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. అంతే కాదు.. ఈ నోటిఫికేషన్ సమయంలోనే ఏకంగా నియామక ఉత్తర్వులు అందుకునే తేదీ కూడా ప్రకటించేశారు. ఇప్పుడు ఈ ఏపీ డీఎస్సీ జోరు చూసిన తెలంగాణ నిరుద్యోగులు అదీ చంద్రబాబుకూ కేసీఆర్ కూ ఉన్న తేడా అంటూ పోల్చి చూసుకుంటున్నారు. వారు అలా చూస్తుండగానే.. ఇటు ఏపీలో డీఎస్సీ సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. లేటెస్టుగా డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌పై మంత్రి గంటా శ్రీనివాస‌రావు స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు. ఏపీపీఎస్సీ చైర్మ‌న్ ఉద‌య్ భాస్క‌ర్ తో మంత్రి గంటా భేటీ అయ్యి.. ఖాళీలు, సిల‌బ‌స్, రోస్టర్, అర్హ‌త‌లు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చ‌ించారు.

ఏపీ డీఎస్సీని త్వ‌ర‌గా కంప్లీట్ చేసి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జూన్ 12 క‌ల్లా ఎంపికైన వారికి ఉత్త‌ర్వులు అందేలా ప‌నిచేయాల‌ని మంత్రి గంటా శ్రీనివాస‌రావు అధికారులకు స్పష్టం చేశారు. ఈ స‌మావేశానికి పాఠ‌శాల విద్యాక‌మీష‌న‌ర్ సంధ్యారాణి, టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ క‌మీష‌న‌ర్ పాండాదాస్ త‌దిత‌రులు హాజరయ్యారు. డీఎస్సీ నిర్వహించడానికి ఏపీపీఎస్సి సిద్ధంగానే ఉందని ఛైర్మన్ ఉదయ భాస్కర్ తెలిపారు. మొదటిసారి డీఎస్సీని నిర్వహిస్తుండడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఒక్క డీఎస్సీనే కాదు ఏపీలో ఇప్ప‌టికే ప‌లు ఉద్యోగాల‌కు వ‌ర‌సుగా నోటిఫికేష‌న్లు విడుద‌ల‌వుతున్నాయి. 2019లో ఎన్నిక‌ల నేప‌థ్యంలోనే 2018లో భారీ రిక్రూట్‌మెంట్ల‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పెద్ద ప్లానింగ్‌తో ఉంది.

Loading...

Leave a Reply

Your email address will not be published.