కోడిపందేలకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. కోట్లలో బెట్టింగ్?

Spread the love

ప్రతి ఏడాది తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయని అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సందర్బంగా కోడి పందేలు చాలా ఫెమస్ అని చెప్పాలి. అయితే గత కొంత కాలం నుండి అక్కడ లీగల్ గా అలాంటివేమి జరగడం లేదు. ప్రభుత్వం వాటిపై నిషేధించడంతో ఈ సారి ఎలాగైనా కోడిపందేలను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సంస్కృతి సంప్రదాయాలను మాయం చేయవద్దని ఆరోపించారు.

అయితే ఎవరు ఊహించని విధంగా ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. పండగ ఉన్న మూడు రోజుల వరకు కోడిపందేలను జరుపుకోవచ్చని అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిని ఇచ్చిందని హోంమంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప తెలియ‌జేశారు. దీంతో పందెం రాయుడ్లు కోడిపందేలకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. అనుమతి లేని రోజుల్లోనే కోట్లల్లో బెట్టింగ్స్ జరిగాయి. మరి ఇప్పుడు ఏ స్థాయిలో జరుగుతాయో అని అందరు చర్చించుకుంటున్నారు.

 

Loading...

Leave a Reply

Your email address will not be published.