ఉపరాష్ట్రపతి వెంకయ్యా మోసపోయారట..!

Spread the love

నకిలీ ప్రకటన చూసి తాను కూడా మోసపోయినట్లు భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు శుక్రవారం రాజ్యసభలో తెలిపారు. సమాజ్‌‌వాదీ పార్టీ ఎంపీ నరేశ్‌ అగర్వాల్‌ నకిలీ ప్రకటనలపై లేవనెత్తిన చర్చలో భాగంగా వెంకయ్య నాయుడు తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ‘బ‌రువు త‌గ్గాలంటే ఇది వాడండి.. ఇంత డ‌బ్బులు క‌ట్టండి.. అంటూ వ‌చ్చే ప్రక‌ట‌న‌ చూసి తాను కూడా మోస‌పోయానంటూ ఆయన స్వయంగా చెప్పారు. వెయ్యి రూపాయల మందులతో బరువు తగ్గవచ్చన్న ప్రకటనకు డబ్బులు చెల్లించి తాను ఆర్డర్‌ చేశానని వెంకయ్య నాయుడు అన్నారు.

ట్యాబ్లెట్లు అందిన తర్వాత మెయిల్‌ వచ్చిందని, అందులో మరో వెయ్యి రూపాయలు చెల్లిస్తే మీకు అవసరమైన ఒరిజనల్‌ ట్యాబ్లెట్లు పంపిస్తామంటూ అందులో ఉందని ఆయన పేర్కొన్నారు. దీంతో మోసపోయానని గ్రహించి, వినియోగదారుల సంబంధిత మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశానన్నారు. అయితే.. ఆ ప్రకటనలు అమెరికా కేంద్రంగా వచ్చాయని విచారణలో తేలిందని వెంకయ్య నాయుడు చెప్పారు. ఇలాంటి ప్రకటనలను నియంత్రించేందుకు ఏదో ఒకటి చేయాలని ఆయన సంబంధిత మంత్రిత్వ శాఖను కోరారు. భారత ఉపరాష్ట్రపతిగా తాను ఎన్నికైన తరువాతే ఈ సంఘటన జరిగిందని వెంకయ్య నాయుడు ప్రస్తావించారు.

 

Loading...

Leave a Reply

Your email address will not be published.