రాజ్‌‌భవన్‌‌లో పవన్- కేసీఆర్ ముచ్చట్లు!

Spread the love

‘రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు’ అనే దానికి ఈ తాజా సంఘటనే ఉదాహరణ. శీతాకాల విడిదిలో భాగంగా నాలుగు రోజుల భాగ్యనగర పర్యటనకు రాష్ట్రపతి రామ్‌‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం వచ్చారు. రాష్ట్రపతి గౌరవార్థం రాజ్‌‌భవన్‌‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు నాయుడు సహా ప్రతిపక్ష నాయకులు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తదితరులు హాజరయ్యారు. ఇంతవరకూ బాగానే ఉంది.

రాజ్‌‌భవన్‌‌లో జరుగుతున్న విందు వేడుకల్లో ఓ ఆసక్తికర ఘటన అందర్నీ బాగా ఆకర్షించింది. తెలంగాణ సీఎం కేసీఆర్, జనసేన అధినే పవన్ కల్యాణ్ ఒకరికొకరు పలకరించుకున్నారు. ఇద్దరూ కొద్దిసేపు ఏకాంతంగా ముచ్చటించుకున్నారు. ఇంతకు ముందు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్న పవన్- కేసీఆర్ భేటీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది డిన్నర్‌గా మారింది. ఎందుకంటే.. రాష్ట్ర విభజన సమయంలో పవన్ కల్యాణ్- కేసీఆర్ మధ్య విమర్శల పర్వం ఏ స్థాయిలో కొనసాగిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత కూడా కేసీఆర్.. పవన్‌‌పై కొన్ని కామెంట్స్ చేశారు. దానిపై పవన్ తనదైన శైలిలో కౌంటర్ కూడా ఇచ్చారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో పవన్ పార్టీకి 1 శాతం ఓట్లు కూడా రావంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు. దానిపైనా పవన్ తనదైన రీతితో ప్రతిస్పందించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఇద్దరి మధ్యా సృహృద్భావ వాతారణం కనిపించిన దాఖలాలే లేవు. అయితే.. ఆదివారంనాడు రాజ్‌‌భవన్‌‌లో జరిగిన రాష్ట్రపతి విందు వేడుకలో ఇద్దరూ కలిసి చాలాసేపు ముచ్చటించుకున్నారు. ఇది చూసి అవాక్కవడం అక్కడి రాజకీయ వర్గాల వంతయింది.

ఈ విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కేంద్ర మంత్రి సుజనాచౌదరి, తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఈనాడు ఎండీ కిరణ్‌, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌, సినీనటుడు రానా, ఏపీ మంత్రులు, యనమల, చినరాజప్ప, మండలి చైర్మన్‌ ఫరూఖ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, ఎంపీలు కేశవరావు, చిరంజీవి, బాల్క సుమన్‌, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎమ్మెల్యేలు కిషన్‌‌రెడ్డి, రామచంద్రారెడ్డి, తెలంగాణ డీజీపీ మహేందర్‌‌రెడ్డితో పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు హాజరయ్యారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.