చంద్రబాబు మాకు మిత్రుడే..  కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌..!!

Spread the love
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికి మాకు మిత్రుడే అని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ అన్నారు.. నిన్న టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్‌లో శుక్రవారం చర్చ లో మాట్లాడుతూ అయన ఈ కీలక వ్యాఖ్యలు చేసారు.. ఎన్డీఏ  నుంచి బయటకి వచ్చినా అయన ఎప్పుడూ మాకు మిత్రుడే.. మా బంధం తెగిపోయేది కాదు అని అన్నారు.. ఇక ఏపీకి కేటాయించిన నిధులు గురించి మాట్లాడుతూ ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన సమస్యలేంటో మాకు తెలుసు. ఏపీ అభివృద్ధికి ఎంత సాయం అవసరమో అంతా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్నారు.. కాగా విభజన చట్టాన్ని ఇప్పటికే చాలా వరకు అమలు చేశాం.
నూతన రాజధాని నిర్మాణానికి రూ. 1,500 కోట్లు ఇచ్చాం. గుంటూరు, విజయవాడకు అదనంగా రూ. వెయ్యి కోట్లు ఇచ్చాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 6,764 కోట్లు విడుదల చేశాం. ప్రాజెక్టు వ్యయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ విషయంలో ఒక స్పష్టత వస్తుంది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.1,050 కోట్లు ఇచ్చాం. అవసరమైతే ఇంకా ఇస్తాం. రిసోర్స్‌ గ్యాప్‌ భర్తీకి రూ.3, 979 కోట్లు విడుదల చేశాం.  ఇవి కాకుండా ఏపీకి అదనంగా సెంట్రల్‌ యూనివర్శిటీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం, అమరావతి చుట్టూ వంద కిలోమిటర్లు రింగురోడ్డు, ఎయిమ్స్, అగ్రికల్చర్‌ వర్సిటీకి రూ. 135 కోట్లు మంజూరు చేశాం. ఇవే కాకుండా ఇంకా చాల చేసాం..  ఇకనైనా టీడీపీ ప్రత్యేక హోదా అంశాన్ని పక్కనపెట్టి ఇప్పటి వరకు మంజూరు చేసిన ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని అభివద్ధి చేయడంపై దృష్టి సారించాలి’ అని సూచించారు.
Loading...

Leave a Reply

Your email address will not be published.