రాజకీయాలు కొత్త కాదు.. డిసెంబర్‌ 31న అసలు విషయం చెప్తా..

Spread the love

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా? లేదా? అని చాలా కాలంగా అభిమానులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై డిసెంబర్‌ 31న తానే స్వయంగా ప్రకటిస్తానని రజనీ స్పష్టం చేశారు. రజనీకాంత్‌ మంగళవారం చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో అభిమానులతో సమావేశమయ్యారు. ఇవాళ్టి నుంచి డిసెంబర్‌ 31వరకు వారం రోజుల పాటు అభిమానులతో రజనీ సమావేశం కానున్నారు. 18 జిల్లాలకు చెందిన దాదాపు వెయ్యి మంది అభిమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ.. ‘యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందాం. దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తాను. మిమ్మల్ని మళ్లీ కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సమావేశం ఏర్పాటు చేయాలని ముందుగానే ప్లాన్‌ చేశాను. రాజకీయ విషయంలో నేను తీసుకునే నిర్ణయం ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తుంది అని బాగా ఆలోచించాలి. నాకు రాజకీయాలు కొత్తేం కాదు. కాకపోతే ఆలస్యమైందంతే. రాజకీయాల్లోకి రావడం అంటే విజయం సాధించేసినట్లే. ఏ విషయం అన్నది డిసెంబర్‌ 31న ప్రకటిస్తాను’ అని వ్యాఖ్యానించారు. ‘నేను హీరో కావడం నాకే ఆశ్చర్యం కలిగించింది. మొదట్లో హీరోగా చేయడానికి భయపడ్డా.

ఎందుకు హీరోగా చేస్తున్నావని కొందరు భయపెట్టారు. మొదటి సినిమా హిట్టయ్యాక వారే వచ్చి అభినందించారు. హీరోగా నా తొలి సంపాదన రూ.50వేలు. మొదట్లో నేను నటించేదే నటన అనుకున్నా. నా నటనను ప్రేక్షకులు కూడా అంగీకరించారు. దర్శకుడు మహేంద్రన్‌ నాకు నటనలో మెళకువలు నేర్పారు. నన్ను నటనలో మరోస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి మహేంద్రన్‌’ అని రజినీ కొనియాడారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.