చంద్రబాబు ఆలోచనలకు ఫిదా అయిన రాష్ట్రపతి

Spread the love

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలనతో ఏపీ ని అభివృద్ధిలో తారా స్థాయికి తీసుకెళుతున్నాడు. ఇప్పటికే దేశ విదేశాల్లో పర్యటనలు చేసి కొత్త రాజధాని అమరావతి వచ్చి పెట్టుబడులను పెట్టాలని బడా కంపెనీలతో మాట్లాడారు. వచ్చే ఎలక్షన్స్ లోపు వీలైనంత త్వరగా రాజధాని పనులను ముగించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే కాకుండా గ్రామస్థాయిలో కూడా కొన్ని అభివృద్ధి పనులను స్టార్ట్ చేయాలనీ ఆయన ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు.

చంద్రబాబు సరికొత్త టెక్నాలిజీని అభివృద్ధిలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చంద్రబాబు పాలనకు చాలా ఆకర్షితులు అయినట్లు తెలుస్తోంది. ప్రతి పనిలో టెక్నాలిజీ ఉపయోగిస్తుండడం రాష్ట్రపతికి బాగా నచ్చిందట. దీంతో ఆయన ఏపీకి సంబందించిన కొన్ని పనుల వివరాల గురించి అధికారులను అడిగిమరి తెలుసుకున్నారట.

అయితే ఈ నెల 27న రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించాలని డిసైడ్ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. అంతే కాకుండా ఫైబర్ గ్రిడ్ ద్వారా చేపట్టిన ఇంటింటికీ ఇంటర్నెట్ అలాగే వై-ఫై కేబుల్ కనెక్షన్ వంటి ప్రతిష్టాత్మక సేవలను ఆయన చేతుల మీదుగా స్టార్ట్ కానున్నాయి. అందుకోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తోంది.

 

Loading...

Leave a Reply

Your email address will not be published.