టీడీపీ పై పవన్ సంచలన కామెంట్స్

Spread the love

ప్రస్తుత రాజకీయాల్లో తనదైన శైలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మారో సారి ట్విట్టర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశాడు. కొని సమస్యలపై తాను వ్యక్తిగతంగా విషయాల్లో తలదూర్చితే అధికారులపై తీవ్ర ఒత్త్తిడి పెరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా విశాఖపట్టణం లోని పెందుర్తిలో ఓ దళిత మహిళపై అందరు చూస్తుండగా ఆమె వస్త్రాలను చింపిన ఘటనపై జనసేన అధినేత ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తనకు చాలా బాధను కల్గించిందని చెబుతూ.. అధికార పార్టీకి సంబందించిన వారే ప్రధాన పాత్రులని రిపోర్టులు చెబుతున్నాయని చెప్పారు. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందువల్ల ప్రజల దృష్టిలో ప్రభుత్వంపై నమ్మకం పోయి చేడు సంకేతాలు వెళతాయని చెప్పారు. ఇక కొందరు చేసే పనులకు కులం రంగు పులుముతున్నారని ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదని తెలిపారు.

అలాగే రోహిత్ వేమూల విషయంపై కూడా ప్రభుత్వం స్పందించాలని దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ ఘటన కు పరిష్కారం ఆలోచించాలని వ్యక్తిగతంగా తాను ఆ విషయం గురించి చర్చిస్తే అధికారులపై ఒత్తిడి పెరుగుతుందని అందుకే తగిన న్యాయం చేయాలనీ వేసుకుంటున్నట్లు పవన్ చెప్పారు. ఇక కారంచేడు – చుండూరు ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని సూచించారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.