ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన చిన్నారికి మంత్రి కేటీఆర్ ఎలాంటి సహయం చేశారో తెలుస్తే గ్రేట్ అంటారు..!

Spread the love

మానవత్వానికి రాష్ట్రాలు, జిల్లాలు, సరిహద్దులు ఉండవని తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ నిరూపించారు. ట్విట్టర్‌ ద్వారా తనకు వచ్చిన ఓ నెటిజన్ అభ్యర్థన చూసి చలించిపోయారు.మన పక్క రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ నుంచి చికిత్స కోసం హైదరాబాద్‌కు వచ్చిన చిన్నారి వైద్యానికి భరోసా ఇచ్చారు.వ్యక్తిగతంగా దవాఖానవర్గాలతో నేను మాట్లాడి సరైన వైద్యం అందిస్తా అని హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే..ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన దీపాన్షు అనే చిన్నారి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు.. వైద్యం అందించేందుకు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. బాలుడి చికిత్స కోసం సుమారు రూ.16 లక్షల వరకు ఖర్చు అవుతాయని వైద్యులు వెల్లడించారు.

అయితే అంత డబ్బు ఖర్చుపెట్టే స్థోమత వారికి లేకపోవడంతో.. ఓ నెటిజన్ ఈ విషయాన్ని బుధవారం ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. పొరుగు రాష్ర్టానికి చెందిన చిన్నారి కావడంతో సీఎం ఆర్‌ఎఫ్ ద్వారా సాయం చేయలేం. కాని.. ఈ చిన్నారి కోసం నేను వ్యక్తిగతంగా సాయం చేస్తాను. దవాఖాన ఉన్నతవర్గాలతో మాట్లాడి వీలైనంత తక్కువ ఖర్చుతో చికిత్స పూర్తయ్యేలా చూస్తా అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మరోసారి తన పెద్ద మనసును చాటుకున్న మంత్రి కేటీఆర్ కు నెటిజన్లు హ్యట్సాఫ్ కేటీఆర్ అంటూ ప్రశంసిస్తున్నారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.