‘కత్తి’కి కోన వెంకట్ డెడ్ లైన్?..15న ఏం జరగబోతుంది?

Spread the love

సినీ క్రిటిక్ మహేష్ కత్తి వివాదం రోజురోజుకి మరింత ముదురుతున్న విషయం తెలిసిందే. పవన్‌కు సపోర్ట్ చేస్తూ మాట్లాడిన పూనమ్ కౌర్, కోన వెంకట్‌లపై కూడా మహేష్ కత్తి విమర్శలు చేసారు. అయితే ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదనుకున్నాడేమో కోన వెంకట్.. ఈ విషయంపై తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘మౌనం ఎప్పటికీ మోసం చేయదు. జనవరి 15వ తేదీ వరకు అంతా మౌనంగా ఉండండి. కత్తి మహేష్‌కి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీడియా ఛానెళ్లకు వెళ్లి చర్చల్లో పాల్గొనటం.. పవన్‌కు, ఆయన అభిమానులకు వ్యతిరేకంగా మాట్లాడటం లాంటివి చేయొద్దని కోరుతున్నా.

అలా చేస్తే శాంతి చేకూర్చాలన్న ప్రయత్నం విఫలమవుతుంది’ అని కోన వెంకట్‌ ట్వీట్‌ చేశారు. కోన వెంకట్ చేసిన ఈ ట్వీట్ ఇపుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. జనవరి 15న ఏం జరుగబోతుంది? ఆరోజుకి వున్న ప్రాధాన్యత ఏంటీ? జనవరి 15న పవన్ ఈ విషయంపై మాట్లాడబోతున్నాడా అనే ఉత్కంఠ మొదలయ్యింది. మరి కోన వెంకట్ ట్వీట్‌లో వున్న అంతర్యం ఏంటో తెలియాలంటే జనవరి 15 వరకు వేచిచూడాల్సిందే. కానీ అంతవరకు మహేష్ కత్తి మరియు పవన్ అభిమానులు ఓపికగా, మౌనంగా ఎదురుచూస్తారో లేదో చూడాలి. అయితే జనవరి 15వరకు ఎలాంటి గొడవలు వద్దనడానికి ‘అజ్ఞాతవాసి’ సినిమాయే కారణమని తెలుస్తోంది.

సినిమా విడుదల సమయం పడుతుండటంతో.. ఇలాంటి సమయంలో ఎందుకు ఇలాంటి నెగెటివ్ కథనాలు.. ఈ వివాదం ఇలాగే కొనసాగితే.. కలెక్షన్లు రాని పరిస్థితి ఏర్పడుతుందేమోననే ఉద్దేశ్యంతో కోన వెంకట్ ఇలా స్పందించి వుండవచ్చని సినీజనాలు భావిస్తున్నారు. పవన్ నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఈనెల 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్ విషయం తెలిసిందే..

Loading...

Leave a Reply

Your email address will not be published.