సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తాం – తెలంగాణా సీఎం కేసీఆర్..!!

Spread the love

పంచాయితీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులమీద సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తామని తెలంగాణా సీఎం కేసీఆర్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల ఎన్నికలకు కేటాయించే రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అభ్యంతరం తెలిపారు కేసీఆర్.. పంచాయతీల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

తెలంగాణలో మొత్తం 61 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మొత్తం 61 శాతం రిజర్వేషన్ల అమలు అవసరాన్ని సుప్రీంకోర్టుకు వివరిస్తామని సీఎం తెలిపారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కాంగ్రెస్‌ హైకోర్టులో పిటిషన్ వేయించిందని, కాంగ్రెస్ పార్టీ బీసీల రిజర్వేషన్లకు గండి కొట్టిందని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు.. పంచాయితీ ఎనికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.

Loading...

Leave a Reply

Your email address will not be published.