‘చెత్త దేశాల నుంచి వచ్చేవారు మనకెందుకు?’

వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెత్త దేశాల (షిటోల్ కంట్రీస్) నుంచి వచ్చే వలసవాదులు మనకెందుకంటూ వ్యాఖ్యానించారు. వలస సంస్కరణలపై చట్టసభ సభ్యులతో గురువారం ప్రత్యేక సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమావేశానికి హాజరైన ఓ వ్యక్తి మీడియాకు వెల్లడించారు. హైతీ, ఎల్ సాల్వడార్, ఆఫ్రికా దేశాలనుద్దేశించి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘చెత్త దేశాల నుంచి వచ్చే వారు మనకెందుకు?.

నార్వే వంటి దేశాల నుంచి అమెరికా ఎక్కువ మందిని ఆకర్షించాలి. అలాగే ఆసియా దేశాల నుంచి వచ్చే వలసదారులకు ఆహ్వానించాలి, ఎందుకంటే ఆర్థికంగా వారు అమెరికాకు సహాయం చేస్తున్నారు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ వ్యాఖ్యలను వైట్‌ హౌస్ వెనకేసుకొచ్చింది. కొంతమంది వాషింగ్టన్‌ రాజకీయవేత్తలు విదేశాల కోసం పోరాటం చేస్తోంటే.. అధ్యక్షుడు ట్రంప్ అమెరికన్ ప్రజల కోసం పోరాడుతున్నారని వైట్ హౌస్ ప్రతినిధి రాజ్ షా ఒక ప్రకటనలో తెలిపారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.