పాకిస్తాన్‌కు ఝలక్ ఇచ్చిన డోనాల్డ్‌ ట్రంప్‌

Spread the love

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పాకిస్థాన్‌కు గట్టి ఝలక్‌ ఇచ్చారు. తాలిబన్లు, ఉగ్రవాదుల సంస్థలకు స్వర్గధామంగా మారిన పాక్‌ను ట్రంప్ నోటీసుల్లో చేర్చారు. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న దేశాల జాబితాలో పాక్‌ను ట్రంప్ తొలి స్థానంలో చేర్చినట్లు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ వెల్లడించారు. ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లో పర్యటిస్తున్న మైక్‌.. అక్కడి అమెరికా బలగాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ ప్రకటన చేశారు.

‘చాలాకాలం నుంచి తాలిబన్లు, ఉగ్రవాద సంస్థలకు పాక్ ఆశ్రయం కల్పిస్తోంది. ఇప్పుడు అలాంటి రోజులు ముగిశాయి. పాక్‌ను ట్రంప్‌ నోటీసులో చేర్చారు’ అని పెన్స్‌ తెలిపారు. ‘అమెరికా భాగస్వామ్యం ద్వారా పాకిస్తాన్ చాలా లబ్ధి పొందుతోంది. ఇప్పుడు క్రిమినల్స్, ఉగ్రవాదులతో పాక్ తన సంబంధాలు ఇలాగే కొనసాగిస్తే.. పెద్ద మొత్తంలో కోల్పోవాల్సి ఉంటుంది. పొరుగు దేశాలైన భారత్, అఫ్ఘనిస్థాన్‌లపై ప్రభుత్వేతర శక్తులను ఉపయోగించాలని చూస్తున్న పాక్‌ను హెచ్చరిస్తున్నాం. అలాంటివి ఇక ఆపేయాలి.

మా సాయుధ దళాల ప్రభావాన్ని పరిమితం చేసిన ఆంక్షలను మేము ఎత్తివేశాం. శత్రులపై యుద్ధానికి మా సాయుధ బలాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే అప్ఘనిస్థాన్‌ సరిహద్దులో మా బలగాలను దింపాం. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కొని ఉన్నా వారిని హతమార్చాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలు ఇచ్చింది. మా అధ్యక్షుడు ఎంత సైన్యాన్ని ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నారు. అందుకే పాక్‌ ఉగ్రవాదుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి’ అని పెన్స్‌ పేర్కొన్నారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.