ఐడియా వాడే వారికి శుభవార్త.. న్యూ ఇయర్ స్పేషల్ ఆఫర్ ఇదే

Spread the love

ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియోకు పోటీగా టెలికాం సంస్థలన్నీ వినియోగదారులకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించాయి. టెలికామ్ రంగంలో ఇలా పెను విప్లవం తీసుకువచ్చిన జియో రీఛార్జ్ ప్లాన్ల పోటీని తట్టుకునేందుకు టెలికాం సంస్థలు ముప్పు తిప్పలు పడ్డాయి. తాజాగా ఇదే తరహాలో జియోకు పోటీనిచ్చే దిశగా.. ఐడియా కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. కొత్త సంవత్సరం సందర్భంగా రూ. 199, రూ. 299 రీఛార్జీ ప్లాన్ల‌ను జియో ప్ర‌వేశ‌పెట్టిన నేపథ్యంలో ఇప్పటిదాకా ఉన్న ఆఫర్‌ను సరి చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు రూ. 309కి రోజుకి 1 జీబీ డేటాను మాత్ర‌మే ఐడియా ఇచ్చేది.

ఇక నుంచి రోజుకి 1.5 జీబీ డేటాను ఇవ్వ‌నున్నట్లు ప్రకటించింది. అలాగే లోక‌ల్‌, ఎస్‌టీడీ కాల్స్‌పై 28 రోజుల పాటు ఎలాంటి పరిమితి లేదని ప్రకటించింది. అలాగే రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లను అందించనున్నట్లు ఐడియా ప్రకటించింది. ఇప్పటికే ఎయిర్ టెల్ రూ.349లకు రోజుకు 2 జీబీ డేటా అందిస్తోంది. ఇందులో అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లను 28 రోజులకు అందిస్తోంది.

Loading...

Leave a Reply

Your email address will not be published.