విజయవాడలో అన్న కాంటీన్ ప్రారంభం..!!

Spread the love

ఏపీలో పేద, మధ్య తరగతి ప్రజలకు అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చేశాయి. బుధవారం విజయవాడలోని విద్యాధరపురం నుంచి ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం సిటీకి వచ్చిన పేదలతో కలిసి భోజనం చేశారు. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 35 పట్టణాల్లో 100 క్యాంటీన్లు పనిచేయనున్నాయి. ఈ క్యాంటీన్‌ల ద్వారా రూ.5 కే భోజనం, టిఫిన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడుపూటలా రూ.73లు ఖర్చయ్యే ఆహారాన్ని.. ఈ క్యాంటీన్ల ద్వారా కేవలం రూ.15 లకే పంపిణీ చేయడం గమనార్హం.

ఇందుకు సంబంధించిన క్యాటరింగ్‌ బాధ్యతలను అక్షయపాత్ర సంస్థ నిర్వహిస్తోంది. ప్రతి క్యాంటీన్‌లో రోజుకు 250-300 మందికి ఆహారం అందనుంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అన్న క్యాంటీన్లకు దాతలు విరాళాలిచ్చి దాతృత్వాన్ని చాటుకోవాలి. ఎన్టీ రామారావు తిరుమలలో ప్రారంభించిన అన్నదాన కార్యక్రమానికి దాతలు ఇస్తున్న విరాళాలు నేడు రూ.850 కోట్లకు చేరుకున్నాయి. పేదలకు అన్నం పెట్టడం కంటే పుణ్యం మరొకటి ఉండదు. అవకాశం ఉన్న వారంతా పిల్లల జన్మదినం, ఇతర శుభ సందర్భాల్లో, పెద్దల పేరుతో పేదలకు అన్నం పెట్టేందుకు అన్న క్యాంటీన్లుకు రండి” అని ముఖ్యమంత్రి సూచించారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.