జగన్ కి.. బాబు బర్త్ డే విశేష్.. అసలు కారణం ఇదే

Spread the love

నిన్న వైసీపీ అధినేత జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి .. పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు అందించారు ..అయితే ఎవరు ఊహించని విధంగా ,టీడీపీ అధినేత ..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ కి గ్రీటింగ్స్ చెప్పడం పలువురిని ఆశ్చర్యపరిచింది ..ఈ విషయం జగన్ కి కూడా షాకింగ్ ..ఎందుకంటే ..మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్న అన్న చంద్రబాబు మాటలు ..మీ శుభాకాంక్షలు ఆశ్చర్యాన్ని కలిగించాయి ..కృతజ్ఞతలు అని జగన్ చెప్పడం విశేషం.. చంద్రబాబు చేసిన ఈ పని టీడీపీ నాయకులకు కూడా ఆశ్చర్యపరిచింది ,..అయితే చంద్రబాబు ఇలా చెయ్యడానికి ఓ కారణం ఉన్నట్టు తెలుస్తుంది ..గతంలో ముఖ్యమంత్రులు విపక్ష నేతలకు చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు ..వారి ఇంటికి వెళ్లి భోజనాలు కూడా చేసేవారు ..కానీ ,కొంతకాలముగా అధికార ,విపక్షాలంటే గొడవలు పడటమే పనిగా పెట్టుకుంటున్నారు..

యితే ఇటీవల కొంత మార్పు కనిపిస్తుంది .కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్న ..విపక్ష నేతకు శుభాకాంక్షలు చెప్పటం ఆనవాయితీ ..ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రేవంత్,జానా ,ఉత్తమ్ లకి విశేష్ చెప్పి ఆకట్టుకున్నాడు .ఆంధ్రలో అలంటి ఓ మంచి సంప్రదాయాన్ని నెలకొల్పాలని భావించిన బాబు జగన్ కి శుభాకాంక్షలు చెప్పాడని అంటున్నారు .జగన్ కూడా ముఖ్యమంత్రి పట్ల సానుకూలంగా స్పందించడం ఆహ్వానించదగిన పరిణామంగా భావిస్తున్నారు ..

Loading...

Leave a Reply

Your email address will not be published.