రేవంత్ రెడ్డి లొల్లి ఎక్కడ వరకు వెళ్తుందో..?

Spread the love

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఆయన దూకుడు టాప్ గేర్ లో దూసుకుని పోతోంది. కానీ ఆయన దూకుడు పొలిటికల్ మైలేజి తీసుకుని వస్తుందా లేక చిక్కుల్లో పడేస్తుందా అనేదే ఇక్కడి ప్రశ్న. తెలంగాణ వైద్య శాఖా మంత్రి లక్ష్మా రెడ్డి కి, రేవంత్ రెడ్డి కి మధ్య మరల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.

మేడ్చల్ లో కాంగ్రెస్ నిర్వహించిన సభ అట్టర్ ఫ్లప్ అయిందని, ఇటీవల కాంగ్రెస్ లోకి ఓ జోకర్ వచ్చి చేరాడని లక్ష్మారెడ్డి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమం లో రేవంత్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలతో లక్ష్మారెడ్డి పై విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారం తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

రేవంత్ వ్యాఖ్యల్ని నిరసిస్తూ ఆయన ఫై టిఆర్ఎస్ ఫౌండర్స్ ఫోరమ్ నేతలు మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రజల మనోభవాలని దెబ్బ తీసేవిగా ఉన్నాయని ఆయన అన్నారు. లక్ష్మారెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోనని ఘాటు విమర్శలు చేస్తూ.. ఆయన డాక్టర్ సర్టిఫికెట్ ఒరిజినలేనా అంటూ రేవంత్ ప్రశ్నించారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.