ఏపీ కి చంద్రబాబు దూరం అవుతున్నారా..?

Spread the love

టీడీపీ నేతల్లో చాలామంది తిరుమల విషయంలో జరుగుతున్న రాజకీయాలపై అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా పాలకమండలిని నియమించకపోవడంతో ఆ పదవులును ఆశించినవారు కక్కలేక మింగలేక ఉంటున్నారు. అయితే.. చంద్రబాబు కేంద్రాన్ని కాదనలేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. నిజానికి టీటీడీ ఛైర్మన్ గా యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ పేరు ఖరారైపోయింది. కానీ.. బోర్డులో ఎవరెవరు ఉండాలనే విషయంలో కేంద్రంలోని మంత్రులు జైట్లీ – గడ్కరీ – ఉమా భారతిలు కొన్ని సిఫారసులు చేశారట.

దీంతో చంద్రబాబుకు ఏమీ పాలుపోని పరిస్థితి. జైట్లీని కాదంటే నిధులు ఆగిపోతాయి.. గడ్కరీకి నో చెప్తే పోలవరం డోలాయమానం.. ఇక ఉమాభారతితో పెట్టుకునే సాహసం ఎవరూ చేయరు. దీంతో చంద్రబాబు వారి కేండిడేట్లను నియమించలేక – నో చెప్పలేక ఏకంగా నియామకాలనే ఆపేశారంటున్నారు. మరోవైపు ఇప్పటికే ఈవోగా ఇతర రాష్ర్టాలకు చెందిన వ్యక్తిని నియమించారు. మరోవైపు ఏపీ దేవాదాయ శాఖ కూడా ఎవరూ ఊహించని నిర్ణయం ఒకటి తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో జనవరి 1న ప్రత్యేక పూజలు – కార్యక్రమాలు చేపట్టవద్దని హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టుకు ఆదేశాలు జారీ చేసింది.

జవనరి 1న ఇలా వేడుకలు జరపుకోవడం భారతీయ వైదిక విధానం కాదని అందులో పేర్కొనడం విశేషం. దేవాలయాలను ప్రత్యేకంగా అలంకరించటం వంటివి చేయకూడదని తెలిపింది. ఏపీలోని అన్ని ఆలయాలకు ఈ ఆదేశాలు పంపించింది. నిజానికి దీనిపై ప్రభుత్వంలో చర్చ కూడా జరిగిందట… కానీ చంద్రబాబు దీనిపై ఏమీ అనలేకపోయారని తెలుస్తోంది.

Loading...

Leave a Reply

Your email address will not be published.