ఉత్తరాంధ్ర కు నాయకుల వలస.. మిగిలింది ఆయనొక్కడే..!!

Spread the love
ఎలక్షన్స్ దగ్గరపడుతుండటంతో ఎపి లో రాజకీయాలు మరింత రసవత్తరంగా నెడుతున్నాయి.. ఎవరికీ వారు తమ బలాన్ని నిరూపించుకోవడానికి ప్రజలకు చేరువ అవడానికి యాత్రలను సంకల్పిస్తున్నారు. రాజకీయనాయకులు  ముఖ్యంగా  ఉత్తరాంద్ర ని టార్గెట్ చేస్తూ తమ యాత్ర లను మొదలుపెడుతున్నారు.. రాష్ట్రంలో కీలకమైన భాగం ఉత్తరాంధ్ర కావడంతో అక్కడ ఐదు పార్లమెంట్ సీట్లు, ముపై నాలుగు అసెంబ్లీ సీట్లు ఉండడంతో నేతల కన్ను ఆ ప్రాంతపై పడింది..
మొదటగా ఈ ప్రాంతాల్లో పర్యటించింది పవన్ కళ్యాణ్.. సినీ నటుడు, రాజకీయాల్లోకొచ్చిన కొత్త రోజులు.. కావడంతో పవన్ ఆ ప్రాంతంలో ప్రజా పోరాట యాత్ర మొదలు పెట్టి కావలసినంత మైలేజ్ సంపాదించుకున్నారు.  మొత్తం యాభై రోజులు ఇక్కడే గడిపాడు. ఆ తర్వాత బిజెపి కొత్త ప్రెసిడెంట్  కన్నా లక్ష్మీ నారాయణ కూడా ఉత్తరాంధ్రా టూర్ వేశారు. ఆయన కూడా మూడు జిల్లాలూ చుట్టేసి కాస్త రభస చేసారు..  కాంగ్రెస్ ఇంచార్జ్ఉమెన్ చాందీ  మలి విడతా టూర్ ని ఉత్తరాంధ్రలోనే చేశారు.. ఇక అధికార టీడీపీ అధినాయకుడు మ్ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే నెలకు కనీసం ఒక మారు ఈ జిల్లాలకు వస్తారు. ఇక మిగిలింది వైసిపి అధినేత వైఎస్ జగన్.. ఆయన పాదయాత్ర ఈ నెలలోనే ఉత్తరాంధ్ర జిల్లాలలో మొదలు కానుంది. కచ్చితంగా రెండు నెలల పాటైనా జగన్ ఈ జిల్లాలలో సందడి చేయడం ఖాయం.
Loading...

Leave a Reply

Your email address will not be published.