పవన్ కళ్యాణ్ నిజస్వరూపం బయట పెట్టిన అఖిల ప్రియా..

Spread the love

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి అని తన తల్లిదండ్రులు చెప్పేవారని మంత్రి అఖిల ప్రియ అన్నారు. ఓ ఇంటర్వ్యూ లో అఖిల్ ప్రియ పవన్ కళ్యాణ్ గురించి స్పందించారు. పవన్ కళ్యాణ్ చాలా సింపుల్.. మంచి వ్యక్తి అని భూమా నాగిరెడ్డి తనతో చెప్పారని అఖిల ప్రియ అన్నారు. పీఆర్పీలో ఉన్నప్పుడు తరచుగా తమ తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించుకునేవారని అఖిల ప్రియ అన్నారు.

2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నంద్యాలలో ప్రచారానికి రావలసి ఉంది. కానీ భూమా నాగిరెడ్డి రావద్దని పవన్ ని రిక్వస్ట్ చేయడంతో ఆయన రాలేదని ఆమె వెల్లడించారు. 2014 ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతులు వైసీపీ తరుపున పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా ఎన్నికకు ముందే శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరిన తరువాత మృత్యువాత పడ్డారు. తమ కుటుంబం అంటే పవన్ కళ్యాణ్ కు చాలా గౌరవం అని అఖిల ప్రియ అన్నారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.