అజ్ఞాతవాసి.. ప్లాప్ పై స్పందించి.. పవన్ ను ఇరికించిన త్రివిక్రమ్

Spread the love
పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం అజ్ఞాతవాసి. వీరిద్దరూ వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితులు. వీరి కాంబినేషన్లో వచ్చిన గత రెండు చిత్రాలు మంచి విజయం సాధించారు. ఇండస్ట్రీలో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మధ్య టెంపో కుదిరినంతగా మరే హీరో దర్శకులకు కుదరలేదు. దీనితో అజ్ఞాతవాసి చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ లో కనీవినీ ఎరుగని విధంగా ఈ చిత్రం నేడు విడుదలయింది. భారీ బడ్జెట్, కాస్టింగ్ తో రూపొందిన అజ్ఞాతవాసి ప్రేక్షకులని మెప్పించడంలో విఫలం అయింది.
పవన్ – త్రివిక్రమ్ ల చిత్రం అంటే సహజంగా పంచ్ డైలాగులు, పవన్ కళ్యాణ్ మార్క్ ఎనెర్జిటిక్ సన్నివేశాలు, కామెడీ ని ప్రేక్షకులు అంచనా వేస్తారు. అజ్ఞాతవాసి చిత్రంలో అవన్నీ మిస్సయ్యాయని చెప్పొచ్చు. త్రివిక్రమ్ చిత్రాల్లో ఎమోషనల్ సీన్స్ కూడా ప్రధాన బలంగా ఉంటాయి. ఆ విభాగంలోనూ త్రివిక్రమ్ తన మార్క్ ని కనబరచలేకపోయారు. ఇంట్రడక్షన్ సన్నివేశం, ఇంటర్వెల్ బ్యాంగ్ మినహా ఈ చిత్రంలో హై లైట్ అయిన అంశాలు లేవు. కామెడీ ఆకట్టుకోలేకపోయింది. రావు రమేష్ మాత్రమే కాస్త హాస్యం పండించడానికి ప్రయత్నించారు. యాక్షన్ సీన్స్ కొంత వరకు బావున్నాయి.
ఈ చిత్రంలోని పాటలు విజువల్స్ పరంగా ఆకట్టుకుంటాయి. అభిమానుల అంచనాల సంగతి పక్కన పెడితే కనీసం త్రివిక్రమ్ శైలిలో కూడా లేని చిత్రంగా అజ్ఞాతవాసి మిగిలిపోనుంది. దాంతో ఇప్పుడు ఈ సినిమా ప్లాప్ పై త్రివిక్రమ్ స్పందించినట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల అంచనాలకు అందుకోలేకపోయాం.. కేవలం అంచనాల వల్లే సినిమా ప్రేక్షకులకు నచ్చడం లేదు. విత్ ఔట్ ఎక్స్ పేటేషన్ తో సినిమాకి వస్తే ఖచ్చితంగా నచ్చుతుందని ఆయన అన్నట్లు తెలుస్తోంది.

Loading...

Leave a Reply

Your email address will not be published.