పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన రాజమౌళి, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ.. ఏం జరిగింది..?

Spread the love

బాహుబలితో దేశాన్నే కాదు.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన దర్శకుడు రాజమౌళి. ఒక తెలుగు సినిమాను ప్రపంచపఠంలో నిలిపిన ఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. రాజమౌళి వ్యక్తిగతంగా కూడా ఎలాంటి మరకలేని వ్యక్తి. పలు సోషల్ అవేర్ నెస్ ప్రోగ్రాముల్లో కూడా పాల్గొంటారు.. ఇక ఎన్టీఆర్.. తెలుగు స్టార్ హీరోల్లో ముఖ్యుడు.. ఎంతో సేవాభావం ఉన్న నటుడు. తన సినిమాల్లో అవినీతి అక్రమాలపై ఎన్టీఆర్ స్ఫూర్తివంతంగా సందేశాలిస్తుంటాడు. పోలీస్ గా టెంపర్ లో న్యాయం కోసం నిలబడ్డ ఎన్టీఆర్ నటన తెలంగాణ పోలీసులకు బాగా నచ్చిందట.. అందుకే ఎన్టీఆర్ ను తెలంగాణ పోలీసులు టార్గెట్ చేశారు.. వీరిద్దరితోపాటు విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో దూసుకొచ్చిన నటుడు. ఆ ఒక్క సినిమాతో యువతలో పిచ్చ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.. పైగా తెలంగాణ ప్రాంతానికి చెందిన హీరో కావడంతో తెలంగాణ పోలీసుల దృష్టి విజయ్ దేవరకొండపై పడింది.

ఇప్పుడు తెలంగాణ పోలీసులు వేసిన స్కెచ్ తెలిస్తే వామ్మో అంటారు. తెలంగాణ పోలీసులు హైదరాబాద్ లో జరుగుతున్న మోసాలపై అవగాహన కల్పించేందుకు సెలబ్రెటీలను సంప్రదించారట.. వన్ టైం పాస్ వర్డ్ మోసాలు.. సోషల్ మీడియాలో దగా., ఉద్యోగం ఇప్పిస్తానని మోసం, మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలు, మ్యాట్రిమోనియల్ మోసాలపై ఐదు షార్ట్ ఫిలింలు తీయాలని నిర్ణయించారు. ఇందులో నటించి అవగాహన కల్పించాల్సిందిగా రాజమౌళి, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండలను కోరారు. వీరు ముగ్గురి ఎలాంటి వివాదాలు లేకుండా నీట్ ఇమేజ్ సొంతం చేసుకోవడంతో వీరిని పోలీసులు సెలెక్ట్ చేశారు. ఈ షార్ట్ ఫిలింలలో నటించడానికి ముగ్గురు సెలబ్రెటీలు స్వచ్ఛందంగా ఒప్పుకోవడంతో త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నారట.. అదీ సంగతి.

Loading...

Leave a Reply

Your email address will not be published.