బాలయ్య నిజస్వరూపం బయట పెట్టిన శివాజీ రాజా…

Spread the love

తమ హీరో గొప్పదనం గురించి వేరే ప్రముఖులెవరైనా పొగిడితే అభిమానుల ఆనందానికి అవధులుండవు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ అభిమానుల ఆనందం కూడా ఇలాగే ఉంది. తమ హీరో గురించి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా చేసిన కామెంట్లపై బాలయ్య ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. ఆ కామెంట్స్ తాలూకు వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ‘జై సింహా’ ఆడియో వేడుకలో భాగంగా బాలయ్య గొప్పదనం గురించి మాట్లాడాడు శివాజీ రాజా. తాను ఇప్పటిదాకా ఎక్కడా చెప్పని ఒక విషయం గురించి ఇక్కడ పంచుకుంటానని శివాజీ రాజా అన్నాడు.

ఒకసారి ఓ చిన్న స్థాయి నటుడు క్యాన్సర్ తో బాధ పడుతూ తనను కలిశాడని.. వెంటనే తనకు బాలయ్యే గుర్తుకొచ్చాడని శివాజీ రాజా అన్నాడు. బాలయ్య రాత్రి 9-9.30కే పడుకుంటాడని తనకు తెలుసని.. ఐతే తాను రాత్రి 10.30కి ఫోన్ చేసి ఆ నటుడి గురించి చెప్పానని.. బాలయ్య వెంటనే తానూ వస్తా పద అంటూ క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకెళ్లారని శివాజీ రాజా చెప్పాడు. బాలయ్యది అంత మంచి మనసని శివాజీ రాజా అన్నాడు.  శివాజీ రాజా ఈ విషయం చెప్పగానే ఆడిటోరియం హోరెత్తింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోను బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ల మీద షేర్లు కొడుతున్నారు.

బాలయ్యకు సంబంధించి చాలా వరకు నెగెటివ్ వీడియోలే సోషల్ మీడియాలో హైలైట్ అవుతంటాయి. వాటికి కౌంటర్ గా బాలయ్య ఫ్యాన్స్ ఇప్పుడీ వీడియోను షేర్ చేస్తూ.. చూడండి మా బాలయ్య గొప్పదనం అని కామెంట్ చేస్తున్నారు.

Loading...

Leave a Reply

Your email address will not be published.