తన గురువు రాకేష్ మాస్టర్ నిజస్వరూపం బయట పెట్టిన అడ్డంగా బుక్ చేసిన శేఖర్ మాస్టర్ 

Spread the love
రాకేష్ మాస్టర్… తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని డాన్స్ మాస్టర్. స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ అందించిన ఆయన ఎంతో మందికి విద్య నేర్పించి సినీ ఇండస్ట్రీలోకి దారి చూపించారు. అలా ఆయన వద్ద శిష్యరికం చేసి, విద్య నేర్చుకుని వచ్చిన వారిలో శేఖర్ మాస్టర్ టాప్ పొజిషన్ కు వెళ్లారు. రాకేష్ మాస్టర్ తన ప్రియ శిష్యుల్లో మొదటి స్థానం శేఖర్ మాస్టర్‌కే ఇవ్వడం కాకుండా…. తన సొంత బిడ్డలా చూసుకున్నారు. అలా సొంత బిడ్డలా చూసుకున్న వ్యక్తిపైనే రాకేష్ మాస్టర్ తాజాగా పలు సంచలన కామెంట్స్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. నేను చనిపోతే నా శవాన్ని కూడా శేఖర్ గాడిని తాకనివ్వద్దు అని అన్నారు. రాకేష్ మాస్టర్…. శేఖర్ మాస్టర్ గురించి ఇలా ఎందుకు అన్నారో ఓసారి చూద్దాం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శేఖర్ మాట్లాడుతూ….. రాకేష్ మాస్టర్ వల్లే మీరు ఈ స్థాయికి వచ్చారట కదా? అనే ప్రశ్నకు వెటకారంగా ఓ నవ్వు నవ్వాడు.
అది నాకు బాగా గుచ్చుకుంది. వాడు ఆ మాట అనడంతో బాధ పడ్డాను అని రాకేష్ మాస్టర్ తెలిపారు. శేఖర్ అంటే నాకు ప్రాణం అని మా ఇంట్లో కూడా తెలుసు. మా అక్క కూతురును నాకు ఇస్తానంటే వద్దమ్మా… నేను మందు తాగుతాను, శేఖర్‌కు కరెక్ట్ జోడి అని చెప్పాను అంటే వాడిని ఎంత ప్రేమించానో అర్థం చేసుకోండి… అని రాకేష్ మాస్టర్ తెలిపారు. అయితే ఇదే విషయంపై శేఖర్ మాస్టర్ తన సన్నిహితుల వద్ద స్పందించినట్లు తెలుస్తోంది. నేను కష్టపడ్డాను కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాను. నేను చేసిన ఎన్నో సాంగ్స్ కి రాకేష్ మాస్టర్ డబ్బులు తీసుకున్నాడు. అయిన మాస్టర్ ఎన్ని చెప్పిన అతనే నాకు గురువులాంటివారు. ఆయన ఎన్ని మాటలు అన్న అవి నా మంచి కోసమే అనుకుంటా అని శేఖర్ తన సన్నిహితుల వద్ద రాకేష్ మాస్టర్ గురించి స్పందించినట్లు తెలుస్తోంది.
Loading...

Leave a Reply

Your email address will not be published.