అనకుడని మాటలు అని స్టేజ్ మీదనే సమంతను ఏడిపించిన నాగ్

Spread the love

అక్కినేని అఖిల్, కళ్యాణి ప్రియదర్శన్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘హలో’ మూవీ డిసెంబర్ 22న (రేపు) థియేటర్స్‌లో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం రాత్రి వైభవంగా జరిపారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాగా.. రామ్ చరణ్ తేజ్ చిరు వెంట వచ్చి ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. వీరితో పాటు నాగచైతన్య-సమంత జంట ఈ వేడుకలో హైలైట్‌గా నిలిచారు.

అఖిల్ ‘హలో’ మూవీ గురించి మాట్లాడిన అనంతరం నాగార్జున తన పెద్ద కొడుకు నాగ చైతన్య గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. మా కుటుంబంలో చైకి ఉన్న మంచి మనసు నాకే కాదు మా కుటుంబంలో ఎవరికీ లేదు అనటంతో అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ సమయంలో చైతూ పక్కన ఉన్న సమంత ఉద్వేగానికి లోను కావడంతో ఆమె కళ్లు చెమర్చాయట. నిజమైన ప్రేమ అంటే ఇదే అంటూ చైతూతో సమంత ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సమంత అభిమాని.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత తాజా వీడియోపై స్పందిస్తూ.. అబ్బే!! నేను కన్నీళ్లు పెట్టుకోలేదు, కళ్లకు ఇన్‌ఫెక్షన్‌ సోకింది, అందుకే కన్నీళ్లు వచ్చాయ్ అంటూ గడుసరి సమాధానం చెప్పేసింది సొగసరి కోడలు సమంత. ఇక గురువారం నాటి ప్రీ రిలీజ్ వేడుకలో సమంత అటు నాగ్ ఫ్యాన్స్‌ను ఇటు మెగా ఫ్యామిలీని ఆకట్టుకునేలా మాట్లాడుతూ అందర్నీ ఆశ్చర్య పరిచింది

Loading...

Leave a Reply

Your email address will not be published.