స్టార్ హీరోతో రొమాన్స్ చేస్తున్న సాయి పల్లవి

Spread the love

టాలీవుడ్‌లో నటించినవి రెండు చిత్రాలే అయిన సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. తాజాగా ఆమె ప్రముఖ నటుడు సూర్యతో జోడి కట్టనుందని తెలుస్తోంది. ఈ చిత్ర కథను విని ఆమె ఫిదా అయినట్లు సమాచారం. ఆమెకి అత్యంత ఇష్టమైన నటుల్లో సూర్య ఒకరు. ఆయనతో కలసి నటించాలన్నది సాయి పల్లవి కల.

అది త్వరలో తీరబోతున్నందుకు ఆమె ఆనంద డోలికల్లో మునిగి తెలుతోంది. సూర్య చిత్రాలన్ని సూపర్ డూపర్ హిట్ చిత్రాలే. దీంతో ఆమె మరో సెక్సెస్ ఫుల్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకోనుంది. ఈ చిత్రానికి సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. దీంతో సూర్య అభిమానులు ఈ చిత్రానికి సూర్య 36 అని పిలుచుకుంటున్నారు.

ఈ చిత్రానికి ప్రభు ఎస్ఆర్‌కి చెందిన డ్రిమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మాతగా వ్యవహరిస్తుంది. నేచురల్ స్టార్ నానీతో కలసి ఆమె నటించిన తాజా చిత్రం ఎంసీఏ. మిడిల్ క్లాస్ అబ్బాయి అనేది ఉప శీర్షిక. ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. సక్సెస్ ఫుల్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో గతంలో వచ్చిన ఫిదా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Loading...

Leave a Reply

Your email address will not be published.